Minister Satyakumar: ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదు.. పేరు మాత్రమే మారింది
ఆరోగ్యశ్రీ (Arogyasri) నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ (Satyakumar) తెలిపారు. గత వైసీపీ (YCP) ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజాధనం ధారాదత్తం చేశారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ (Nazir Ahmed) శాసనసభలో ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ (NTR) వైద్యసేవగా మారిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని కింద రూ.457 కోట్ల చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో 13.42 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని, కానీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండిరగ్ జరుగుతోందని తెలిపారు.







