పవన్ ని చూస్తే జాలి కలుగుతోంది.. సజ్జల
వైసిపి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు విలేకరుల సమావేశంలో పాల్గొన్న సజ్జల పవన్ కళ్యాణ్ పై తనకు ఎటువంటి వ్యక్తిగతమైన కక్షలు లేవని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ని చూస్తే తనకు జాలి కలుగుతుంది అంటూ సజ్జల అన్న మాటలు వైరల్ అయ్యాయి. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాడు అంటే జాలి కలుగుతోందట. అంత చరిష్మా ఉన్న పవన్ గత పదేళ్లుగా రాజకీయంలో రాణించలేకపోవడం బాధగా ఉందని సజ్జల అన్నారు. రాజకీయాలపై పవన్ కు క్లారిటీ లేదని అందుకే అతను అలా ప్రవర్తిస్తున్నాడని సజ్జల అభిప్రాయపడ్డారు.













