Y.S.Jagan: వైసీపీ గూటికి సాకే.. కొత్త జోష్ లో పార్టీ నేతలు..
మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి (Y.S family) ప్రధాన మద్దతుదారుడిగా నిలిచిన ఎస్సీ నాయకుడు సాకే శైలజానాథ్ (Sake Sailajanath) రాజకీయాల్లో మరోసారి చురుకుగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు . ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి పీసీసీ చీఫ్గా (P.C.C chief) రఘువీరా రెడ్డి (Raghu Veera Reddy) బాధ్యతలు స్వీకరించగా, ఆయన తర్వాత సాకే ఆ స్థానాన్ని చేపట్టారు. అయితే, అప్పట్లో జగన్కు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడడం లేదని కొందరు పెద్దలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, సాకే కు రాజకీయం పై పెద్దగా ఆశక్తి ఉండకపోవడంతో ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకున్నారు.
సాకే, వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సమీపంగా ఉండిన నేతగా పేరొందారు. డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, శింగనమల నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై మంత్రి పదవిని చేపట్టారు. విభజన తర్వాత రాజకీయాల్లో అంతగా కనిపించని ఆయన, ప్రస్తుతం వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఒకరుగా నిలిచారు.
గత కొన్ని నెలలుగా సాకే వైసీపీలో చేరతారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు ఈ చేరిక జరిగే అవకాశం ఉందని జరిగినప్పటికీ, అది కుదరలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేని పరిస్థితుల్లో కూడా సాకే వైసీపీలో (Y.C.P)చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు సంకేతాలు అందాయి. ఇటీవల సీఎం జగన్తో ఆయన భేటీ అవ్వడం, “వైసీపీలో చాలామంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు” అని వ్యాఖ్యానించడం త్వరలో ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం ఇండైరెక్ట్ గా కన్వే చేసినట్లు టాక్ నడుస్తోంది.
అలాగే, “23 సీట్లతో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది” అని వ్యాఖ్యానించడం ద్వారా జగన్పై సాకేకి ఉన్న నమ్మకాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. దీంతో సాకే వైసీపీలో చేరిక తథ్యం అనేది పరిశీలకుల అభిప్రాయం. వైసీపీ శ్రేణులు కూడా సాకే చేరిక పార్టీకి కొత్త ఊపు తెస్తుంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి బలమైన నాయకుల అవసరం ఉందని, కొత్త చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది . ఈ పరిణామాలను బట్టి సాకే వైసీపీలో చేరడం అతి త్వరలోనే జరుగుతుందని అంచనా వేయవచ్చు.













