ఆళ్లకు సుప్రీంలో మరోసారి చుక్కెదురు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీలో సాధికార మిత్రల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. సుప్రీం తీర్పుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి స్పందిస్తూ ఈ అంశంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని సృష్టం చేశారు. పంచాయితీ రాజ్ చట్టాలను ఉల్లంగిస్తూ సాధికారమిత్రలను నియమించారని విమర్శించారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు గ్రామ పంచాయతీ అధికారులున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకు సాధికార మిత్రలను నియమించారని ఆళ్ల రామకృష్ణరెడ్డి ఆరోపించారు.













