మోసగాళ్ల చేతికి రాష్ట్రాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు.. ఆర్కే రోజా వైరల్ స్టేట్మెంట్..
అన్యోన్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఏపీగా.. తెలంగాణగా విడిపోవడానికి చంద్రబాబు ముఖ్య కారణం అని మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు లో బుధవారం నాడు పర్యటించిన రోజా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాను అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేవలం టిడిపి అధినేత చంద్రబాబు కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి అంటూ ఆమె చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ప్రపంచంలో చంద్రబాబు లాంటి మోసకారి ఎవరూ ఉండరు అంటూ ఆమె అన్నారు. మోసగాళ్ల చేతిలో రాష్ట్రం పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని.. తెలుగుదేశం గెలిస్తే మళ్లీ కష్టాలు మొదలవడం ఖాయమని రోజా అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే ఇక ఆంధ్రాలో చంద్రబాబు, పవన్ ఇద్దరు కనిపించే అవకాశం ఉండదని వాళ్ళు కేవలం హైదరాబాద్ కే పరిమితం అవుతారని రోజా విమర్శించారు.













