తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆర్.ఎఫ్.ఐ.డి ఏర్పాటు – జెఇఓ
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టిటిడి ఆలయాల ఆభరణాలపై మరింత దృష్టి పెట్టినట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. అందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి దేవాలయంలో ప్రయోగాత్మకంగా రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెండిటి డివైజ్ (ఆర్.ఎఫ్.ఐ.డి) టెక్నాలజీ ద్వారా ఆభరణాలకు భద్రత కల్పిస్తామన్నారు. ఆభరణాలకు సెన్సార్మేటిక్ చిప్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎవరైనా దురుద్దేశంతో తరలిస్తే తక్షణం గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆగమ సలహాదారుల సలహా మేరకు గోవిందరాజస్వామివారి ఆలయంలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, దశలవారీగా మిగిలిన టిటిడి స్థానిక ఆలయాలలో అమర్చుతామన్నారు. గోవిందరాజస్వామి బ్రహ్మూత్సవాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు లక్ష్మీకాంతం తెలిపారు.
శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో అధికారులతో కలసి జెఈవో పరిశీలించారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువపందిళ్లు, తాగునీరు, తదితర ఏర్పాట్లు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్ఇ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, ఏవిఎస్వో శ్రీ రాజేష్ తదితరులు ఉన్నారు.













