వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో మళ్లీ
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు రుతుపవన ద్రోణి ఆవరించి ఉండనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే పలు చోట్ల కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.













