ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరని అన్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పెట్రోల్, డీజీల్‌పై రాష్ట్రాలు సుంకాలు తగ్గించాయని తెలిపారు. కస్టడీ సందర్భంగా తనను హింసించిన ఘటనపై తన కుమారుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా విచారణకు రాలేదని తెలిపారు. చాలా సార్లు ప్రస్తావించినా విచారణకు రావడం లేదని అన్నారు. ఎంపీ పరిస్థితి ఇలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో లిక్కర్ విక్రయాల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని మద్యం అమ్మకాల లావాదేవీలపై ప్రధానికి లేఖ రాశానని తెలిపారు. డిజిటల్ విధానంలో లావాదేవీలు జరిగే విధంగా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.













