మాట తప్పని ఆ మహానుభావుడికి సెల్యూట్ : ఆర్ నారాయణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా, మన కాళ్ల కింద ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను (ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్ గారిని తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు సెల్యూట్ అని తెలిపారు.













