R.K.Roja: ఆడుదాం ఆంధ్రా వ్యవహారం: రోజా చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుందా?

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన నగరి (Nagari) మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా (RK Roja) ప్రస్తుతం మరోసారి రాజకీయ దుమారానికి కేంద్రబిందువవుతున్నారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ ఘాటు స్టేట్మెంట్స్ తో వైరల్ అవుతున్నారు. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh) వంటి నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీ తరఫున వాయిస్ ఎత్తే నాయకుల సంఖ్య తక్కువగా ఉన్న వేళ, ఆమె మీడియా వేదికగా ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా జరుగుతున్న పరిణామాల వల్ల ఆమె చుట్టూ కేసుల ముసుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు రెండేళ్ళ పాటు ఏపీఐఐసీ చైర్మన్ పదవి, తర్వాత పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించబడిన విషయం తెలిసిందే. ఈ రెండు కాలాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఇప్పుడు వివాదాలు తిరిగి తెరపైకి వస్తున్నట్లు సమాచారం.
ఆడుదాం ఆంధ్రా (Adudam Andhra) కార్యక్రమం పేరుతో చేపట్టిన క్రియా శీల కార్యక్రమాలపై పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కేసులు నమోదుకావచ్చన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా పాత్యా సంఘం (Pathya Sangham), కబడ్డీ అసోసియేషన్ (Kabaddi Association) వంటి సంస్థల ద్వారా జరిగిన కార్యక్రమాలపై సీఐడీకి ఫిర్యాదులు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, గతంలో రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో వైసీపీ (YCP) పార్టీ ఆమె స్థానంలో కొత్త నాయకుడికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నా, చివరికి మళ్లీ ఆమెకే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తాను బాధ్యతలు తీసుకుంటే యాక్టివ్‌గా వ్యవహరిస్తానని చెప్పిన రోజాకి పార్టీ హైకమాండ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆమెపై నమోదయ్యే కేసులు ఎటు దారి తీస్తాయన్నది ఆసక్తికరమైన అంశం. అరెస్టు ఉంటుందా? లేదా ఈ చర్యలు ఆమె ప్రజాదరణను పెంచుతాయా? అన్నది కాలమే తేల్చాలి. రాజకీయంగా వైసీపీ నేతల పై ఇలా చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వం ఎటువంటి లాభనష్టాలకు దారితీస్తుందన్న చర్చ కూడా కొనసాగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల టార్గెట్ తో అన్ని పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్లాలి అని ట్రై చేస్తున్నాయి..ఇక ప్రజల సపోర్ట్ ఎవరికో చూడాలి..