Purandeswari :పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర మంత్రి(Union Minister) కానున్నారా? ఆమె స్థానంలో పార్టీకి కొత్త చీఫ్ వస్తున్నారా? అంటే కమల నాయకులు ఔననే అంటున్నారు. త్వరలో బీజేపీ (BJP) సంస్థాగత ఎన్నికలు జరుగుతాయనని, జాతీయ కార్యవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షలు వస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి (Purandeswari ) వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే రాష్ట్ర బీజేపీ కూటమి కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇక ఎన్నికలు అయిన అనంతరం పురందేశ్వరికి కేంద్ర మంత్రి వర్గంలో చోదిస్తారని భావించాను. కానీ, అధిష్ఠానం అనూహ్యంగా నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ (Bhupathiraju Srinivasvarva ) ను కేంద్ర సహాయ మంత్రిగా చాన్స్ ఇచ్చింది. ఇక సంక్రాంతి తర్వాత జరిగే విస్తరణలో పురందేశ్వరికి మంత్రి యోగం పట్టనుందని అంటున్నారు.













