నేను లోకల్.. ఇక్కడ సీటు నాదే.. ఆందోళనకు దిగుతున్న పోతిన..
కూటమి కారణంగా టీడీపీ నేతలలో అసంతృప్తి కనపడడం మొదలయింది. కలిసి నడుద్దాం అంటే సరే అన్నారు కానీ తమ సీట్లకే కోతపడుతుంది అని తెలిశాక కాస్త అయిష్టంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నుంచి టికెట్ ఆశించిన టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అయితే జనసేన పార్టీ నుంచి పోతిన వెంకట మహేష్ ఈ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పవన్ కూడా హామీ ఇవ్వడంతో సీటు కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ సీటు బీజేపీ కి ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో షాక్ కు గురి అయిన పోతిన.. విజయవాడ వెస్ట్ టికెట్ తనకే రావాలి అంటూ ఆందోళన చేయడానికి దిగుతున్నారు. రెండు రోజుల క్రితం పోతినను పిలిపించుకొని మరి కలిసిన పవన్.. ఈసారికి ఈ స్థానాన్ని వదిలేయమని అన్నారట. తన పరిస్థితి వివరించినప్పటికీ పవన్ కాదనే చెప్పారట. దీంతో హర్ట్ అయిన పోతిన నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు బాగా హీట్ ఎక్కాయి. ఒకవేళ పోతిన డిమాండ్స్ పై కూటమి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇక అన్ని నియోజకవర్గాలలో ఇలా నిరసనలు తప్పవేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది.ఇక దీనిపై కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి.













