వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు.. పోసాని
సినిమాలో కమెడియన్ గా, విలన్ గా తన విలక్షణమైన నటనతో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫేమస్ అయిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి. ఈయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఆంధ్ర ఎలక్షన్స్ నేపథ్యంలో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న వాలంటీర్ల విషయంపై లేటెస్ట్ గా పోసాని స్పందించారు. కావాలని వాలంటీర్లపై చంద్రబాబు ఆంక్షలు విధించేలా చేశారు అని పోసాని ఆరోపిస్తున్నారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి ఓర్చుకోలేక చంద్రబాబు ఇలాంటి పని చేశారని.. దీనివల్ల వృద్ధులకు ,వికలాంగులకు పెన్షన్ అందక బాధపడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సీటు కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన రాజకీయ భవిష్యత్తు బాగుండడం కోసం అవ్వ తాతల కడుపు కొడుతున్నాడని పోసాని వాపోయారు. చంద్రబాబు గతంలో కాపులను రౌడీలు అన్న సందర్భాన్ని పోసాని మరొకసారి గుర్తు చేశారు. అంతేకాదు చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎటువంటి దారుణాలు చేసినా.. పవన్ కి మాత్రం అతను దేవుడే అని పోసాని ఎద్దేవా చేశారు.













