వంగవీటి రంగా హత్యపై పోసాని సంచలన వ్యాఖ్యలు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయితగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళి.. వైసీపీ నేతగా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనాడు ఆయన దివంగత లెజెండరీ యాక్టర్ మరియు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈనాడు వంగవీటి రంగా బతికి ఉంటే కచ్చితంగా సీఎం అయ్యేవాడు అని అనినా పోసాని.. ఎక్కడ అతను ఎన్టీఆర్ ను మించిపోతాడో అని హత్య చేయించారు అంటూ ఆరోపించారు. అప్పట్లో రంగ కారులో చిన్న కర్ర దొరికిన ఆయనను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లేవారని పోసాని గుర్తు చేశారు. రంగ తనకు ప్రాణహాని ఉంది అని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కి కూడా లేఖ రాశారట. రంగ చనిపోయిన తర్వాత కాపులలో కీలకమైన వ్యక్తులు ఎవరు కూడా రాజకీయ పార్టీలు పెట్టలేదని.. ఇంత కాలానికి పవన్ కళ్యాణ్ వచ్చాడని పోసాని అన్నారు. ప్రజల కోసం వచ్చాను అని చెప్పిన పవన్ ఇప్పుడు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు అని పోసాని మండిపడ్డారు. సీఎం కాలేను అంటూ చెప్పడమే కాకుండా చంద్రబాబుకు మాత్రమే అర్హత ఉంది అని అనడం ఏమిటి అంటూ పోసాని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు పార్టీకి కాపులు ఓటు వేయాల్సిన అవసరం ఏమిటి.. చంద్రబాబు ముద్రగడను ఎంతగా వేధించాడో మర్చిపోయారా? అటువంటి చంద్రబాబుతో పవన్ ఎందుకు తిరుగుతున్నాడు అంటూ పోసాని ప్రశ్నించారు? ప్రస్తుతం పోసాని అన్న ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













