గ్రహ సంచార క్యాలెండర్ ఆవిష్కరణ
శార్వరీ గ్రహ సంచార 2020 క్యాలెండర్ ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఆవిష్కరించారు. గిరిజా జ్యోతిష్య విజ్ఞాన పరిశోధనా కేంద్రం ట్రస్ట్ వ్యవస్థాపకుడు నిడు మోలు వెంకట సుబ్బారావు నేతృత్వంలో తయారైన ఈ క్యాలెండర్ ను ఆదివారం ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిధులు ఎమ్మెల్యే విష్ణు, అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో గాని, దేశంలో గాని ప్రతీ ఒక్కరికీ క్యాలెండర్ అనేది దిక్చూచి అని అన్నారు. నిత్య జీవితంలో తెలియకుండా ప్రతి ఒక్క పనికి క్యాలెండర్ అనేది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మంచి చెడులతో కూడిన వివరాలు ఉండడంతో ప్రతి ఒక్కరి ఇంటిలో దానికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ క్యాలెండర్ ను వాడటం శుభ సూచకం అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.













