Pithapuram Varma: వర్మను సైడ్ చేస్తున్న చంద్రబాబు..! ఎమ్మెల్సీగా మరొకరికి ఛాన్స్..!?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల చాలా మంది సీట్లు త్యాగాలు చేయాల్సి వచ్చింది. దీంతో వాళ్లందరికీ మంచి పదవులు కట్టబెడతామని అప్పట్లో పార్టీ అధినేతలు మాటిచ్చారు. అలాంటి వారిలో పిఠాపురం వర్మ (Pithapuram Varma) ఒకరు. టీడీపీ (TDP) తరపున పిఠాపురం నుంచి పోటీ చేయాలని వర్మ ప్రయత్నించారు. అయితే ఆ సీటు నుంచి జనసేన (Janasena) అధిపతి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేయాలనుకున్నారు. దీంతో వర్మ వెనక్కు తగ్గి పవన్ కల్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. పవన్ కల్యాణ్ ప్రచార బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఆయన్ను అసెంబ్లీకి పంపించారు.
పిఠాపురం వర్మ త్యాగానికి ప్రతిఫలంగా ఆయన్ను ఎమ్మెల్సీ (MLC) చేస్తామని చంద్రబాబు (Chandrababu) అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు. దీంతో వర్మను (Varma) మండలికి (Legislative Council) పంపించి మంత్రి (Minister) పదవి కూడా ఇస్తారని ఆయన అనుచరులు ఆశించారు. వర్మకు తగిన పదవి ఇవ్వాలని పవన్ కల్యాణ్ కూడా కోరుకుంటున్నారు. ఎన్డీయే (NDA) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వంద రోజులు దాటింది. దాదాపు వంద మందికి నామినేటెడ్ పదవులు (Nominated Posts) కూడా ప్రకటించారు. కానీ పిఠాపురం వర్మకు మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఆయన్ను రాబోయే ఎన్నికల్లో బరిలోకి దింపుతారని అందరూ భావించారు. అయితే అది కూడా నెరవేరేటట్లు కనిపించట్లేదు.
త్వరలో రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Krishna – Guntur Graduate MLC) స్థానానికి టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (Alapati Rajendra Prasad) ను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. ఆయన జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కోసం తెనాలి (Tenali) సీటును త్యాగం చేశారు. దీంతో ఆయన్ను మండలికి పంపించాలనే ఆలోచనతో ఆలపాటిని ఖరారు చేసింది. ఆయన ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇక మిగిలిన రెండో సీటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (Godavari Districts Graduate MLC). ఇక్కడి నుంచి పిఠాపురం వర్మను దింపతారని భావించారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మనసులో వర్మ పేరు లేనట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ (Parabathula Rajasekhar) పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి నుంచి కాపు (Kapu) లేదా ఎస్సీ (SC) సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన రాజశేఖర్ సరైన అభ్యర్థి అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాదెండ్లకోసం సీటు త్యాగం చేసిన ఆలపాటికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం వర్మకు సీటు ఇవ్వకపోవడమేంటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పైగా పిఠాపుర వర్మను మండలికి పంపిస్తామని గతంలోనే చంద్రబాబు చెప్పారు. ఈజీగా గెలిచే ఈ సీటును వర్మకు కాకుండా మరొకరికి ఎలా ఇస్తారని అడుగుతున్నారు. మరి చూడాలి చంద్రబాబు ఏం చేస్తారో..!?













