నిర్విరామంగా సాగుతున్న పెన్షన్ పంపిణీ..
రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించుకుంది .ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంటి వద్దకే పెన్షన్ వస్తుంటే అలవాటు పడిపోయిన జనం ఒక్కసారి బయటకు వెళ్లి తీసుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడ్డారు. అందులో మండే ఎండలలో అవ్వ, తాతల పరిస్థితి మరి అద్వానంగా మారింది.. ఈ విషయాన్ని అన్ని పొలిటికల్ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తెగ ప్రయత్నించాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే నిన్నటికి 61లక్షల 36 వేల మందికి పైగా పెన్షన్లు అందాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా పెన్షన్లు అందిస్తూనే ఉన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరొక రెండు రోజుల్లో 94% పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.













