పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇకలేరు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలును నుంచి ఎమ్మెల్సీ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డ్రైవర్, గన్మెన్, ఆయన పీఏ తీవ్రంగా డాయపడ్డారు. వీరిని 108 అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఉండి ఏఎస్సై సూర్యారానాయణ, ఎంపీడీవో కొండలరావు, ఇతర అధికారులు పరిశీలించారు.













