చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన జనసేన అధినేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్వవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంపట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారు. జీవో 64ను రద్దుచేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపశమనం కల్గిందని పవన్ తన ట్విటర్లో పేర్కొన్నారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కొందరు విద్యార్థులు హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ను కలిసి తమ గోడు విన్పించుకున్నారు. దీనికి స్పందించిన పవన్ వ్వవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారిన జీవోను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.













