Pawan Kalyan: 2019 నుంచి 2025 వరకు బ్రిటిష్ పాలన : పవన్ కల్యాణ్

ఎంతోమంది మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం ఆయన పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ (Super Six ) అమలు చేసి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చు. 2019 నుంచి 2024 వరకు బ్రిటిష్ (British) పాలన మాదిరిగా మారింది. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో మేము పాలన కొనసాగిస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారు. గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడినప్పుడు మరో న్యాయమా? వైసీపీ (YCP) పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవి. అవినీతికి అలవాటుపడిన వాళ్లు ఏమైనా చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అని తెలిపారు.