పొలిటికల్ ‘బ్రో’
పవన్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో ..ఏపీలో రాజకీయంగా వివాదానికి దారితీసింది. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రృధ్వీ పాత్ర.. మంత్రి అంబటిని పోలి ఉందంటూ విపరీతంగాట్రోల్ అవుతోంది. ఇటీవల మంత్రి అంబటి రాంబాబు.. ఓకార్యక్రమంలో పబ్లిక్ తో కలిసి డ్యాన్స్ చేశారు. చక్కగా స్టెప్పులేశారు. ఆసమయంలో అంబటి వేసిన డ్రెస్సును పోలిన డ్రెస్‌తోనే బ్రో సినిమాలో ప్రృథ్వీ కనిపించారు.దీంతో తన పాత్రను కమెడియన్ గా చూపించారని అంబటి ఫైరయ్యారు.
ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా అంబటి రాంబాబు స్పందించారు. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి! ఓడినోడి డాన్స్ కాళరాత్రి!’ అంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. అంతేకాదు…తాను ఎవరి దగ్గర ప్యాకేజీలు, డబ్బులు తీసుకుని డ్యాన్స్ చేయనన్నారు. సంక్రాంతి సందర్భంగా తాను వేసిన డ్యాన్స్ ఆనందతాండవమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆనందం తనదైతే.. ఇలాంటి పనులు చేసి పవన్ కల్యాణ్ శునకానందం పొందుతున్నారని విమర్శలు చేశారు.పవన్ తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
‘బ్రో’ సినిమాపై కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు.సినిమా మొత్తం చూసిన తర్వాతే విడుదల చేశామన్నారు.కావాలని ఎవరినీ ఇమిటేట్ చేయలేదని తెలిపారు. మరోవైపు అంబటి రాంబాబు ఏమైనా ఆస్కార్ లెవల్ ఆర్టిస్టా.. ఆయనను ఇమిటేట్ చేయడానికి అని ప్రశ్నించారు కమెడియన్ ప్రృథ్వి.నటుడిగా నాకిచ్చిన పాత్రను చేశా. ఓ పనికి రాని దద్దమ్మ, బాధ్యతలు వదిలేసి, క్లబ్సులు, పబ్బులు, అమ్మాయిల వెంట తిరిగే పాత్ర నేను చేశా. అంబటి రాంబాబును పోలి ఉన్న సన్నివేశాలు చేయాల్సిన అవసరం నాకు, మా టీమ్‌కు, మా జనసేన అధ్యక్షుడికి లేదన్నారు.
దీంతో వివాదం కాస్తా అంబటి వర్సెస్ బ్రో గా మారింది.మరి ఈసినిమాపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు… ఇది బ్రో సినిమాకు మంచి ప్రచారం కల్పించిందని చెప్పొచ్చు.సినిమాపై వివాదం తీవ్రరూపం దాల్చడంతో.. అసలు అందులో ఏం చెప్పారన్న ఆసక్తి సైతం ప్రేక్షకుల్లో కలుగుతోందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.













