అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే రెండు సీట్లను ప్రకటించిన జనసేనాని
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లికన్ డే వేడుకల్లో జాతీయ పతకాన్ని పవన్ ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాను 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నాం. ఆ పార్టీతో కలిస్తే బలవంతులమవుతాం. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటు ఉంటుంది. ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు. సీఎం జగన్కు ఊరంత శత్రువులే. ఆయనపై వ్యక్తిగత కక్ష లేదు. వైసీపీ నేతలకు కష్టమెస్తే నా వద్దకు రండి. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు అని అన్నారు.













