PM Modi పవన్ కల్యాణ్ కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ ఎన్డీయే (NDA ) ను బలోపేతం చేస్తున్నారన్నారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.