మంగళగిరి నియోజకవర్గంలో నిత్యవసర సరుకుల పంపిణీ
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో పేదలు ఆహారం దొరకక ఇబ్బందులు పడకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు సూచనల మేరకు బిజెపి నేత పాతూరి నాగభూషణం గారి ఆధ్వర్యంలో లో “లాక్ డౌన్” మొదటినుంచి రోజువారీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆహార పొట్లాలు మరియు నిత్యవసర సరుకులను పేదలకు అందించడం జరుగుతుంది. కాగా ఈ రోజు 20/04/2020 మంగళగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జవ్వాది అమ్మయ్య చౌదరి గారు, మరియు మంగళగిరి మండల అధ్యక్షులు వాసం శ్రీనివాసరావు గారు మరియు మండల ప్రధాన కార్యదర్శి మారెళ్ళ సాంబశివరావు గారు, బిజెపి నాయకులు మేకల జాన్ బాబు గారు పాల్గొని పేదలకు ఆహార పొట్లాలు మరియు నిత్యవసర సరుకులు సరుకులను అందజేశారు, రేవేంద్రపాడు వంతెన పరిసర ప్రాంతాల్లో విధినిర్వహణలో ఉన్న పోలీస్ సోదరులకు వాటర్ బాటిల్ మరియు ఆహార పదార్థాలు అందజేశారు.













