తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు : పరిటాల సునీత
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంటసేపు కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షా స్థలి వద్ద సునీత మాట్లాడారు. మాలో ప్రవహించేది సీమ రక్తమే అని అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉడమన్నారు కాబట్టే ఉన్నామని అన్నారు. అనాడు చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని అన్నారు. చంద్రబాబు తీరు మారాలని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కులు చూపిస్తామని హెచ్చరించారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఊ అంటే మంత్రులను తిరగనివ్వం. తిట్లు మాకు వచ్చు మేము మాట్లాడగలం మాకు బీపీ వస్తోంది. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.













