పసుపు జెండా వదిలి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన పనబాక లక్ష్మి..
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత పనబాక లక్ష్మి తిరిగి హస్తం కు షేక్ హ్యాండ్ ఇచ్చారు అని టాక్. త్వరలో ఆమె కాంగ్రెస్ లో తిరిగి చేరనున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పవర్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మి హస్తం చేతిని వీడి పసుపు జెండా పట్టుకున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు . సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పనబాక లక్ష్మి గెలవలేకపోయారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలలో పనబాక గురించి టీడీపీ నిర్వహించిన సర్వే ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి.ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పనబాక లక్ష్మికి టీడీపీ తరఫున టికెట్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే పనబాక లక్ష్మి మాత్రం పోటీ నుంచి తప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. అందుకే పాత గూటికి చేరి కొత్త పాట పాడడానికి పనబాక లక్ష్మీ రెడీ అయిపోయా రు అని సమాచారం. బాపట్ల నియోజకవర్గం నుంచి పనబాక లక్ష్మి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుంది.













