ఈ ఘటన సిగ్గుచేటు.. సీఎం కాన్వాయ్ కోసం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెల్లారని, రాష్ట్రంలో దౌర్బాగ్య పాలనకు ఇదే నిదర్శమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుటుంబంతో తిరుమల వెళ్తున్న వినుకొండ వాసిని వేముల శ్రీనివాస్ వాహనాన్ని ఒంగోలు వద్ద పోలీసులు అడ్డుకుని ఆయన కారు తీసుకెళ్లిన ఘటనపై చంద్రబాబు స్పందించారు. భార్య, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్లింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడతారా? అధికారుల చర్యలతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని నిలదీశారు.













