సీఎం వైఎస్ జగన్ కు ఓబీసీ మహాసంఘ్ ఆహ్వానం
రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆగస్టు 7న తిరుపతిలో ఎస్వీ స్టేడియంలో నిర్వహించనున్న 8వ జాతీయ మెగా కన్వెన్షన్లో పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో ఆలిండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఫ్ు నాయకులు డాక్టర్ బాబారావు తైవాడే, సచిన్ రాజుర్కర్, జాజూల శ్రీనివాస్ గౌడ్, కేశన శంకరరావుతో పాటు మంత్రి జోగి రమేశ్ కూడా ఉన్నారు.













