హెల్త్ యూనవర్సిటీ బోర్డుపై వైఎస్ఆర్ పేరు.. అక్షరాలు మార్చిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేశారు. ఎన్టీఆర్ స్థానంలో వైఎస్ఆర్ పేరు ఉన్న బోర్డును యూనివర్సిటీ అధికారులు రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ బోర్డును మార్చినట్లు సమాచారం. సెప్టెంబరు 20వ తేదీన యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్ఆర్ పేరు పెట్టాలని ఉత్తర్వులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు ధృవికరిస్తూ గవర్నర్ కూడా సంతకాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఉన్న బోర్డును మార్చేందుకు అధికారులు వేగంగా కదిలారు. ఎన్టీఆర్ పేరులోని మొదటి రెండు అక్షరాలు తొలగించి వాటి స్థానంలో వైఎస్ అనే రెండు అక్షరాలు చేర్చారు. ఇద్దరి నాయకుల పేర్లల్లో ఆర్ అక్షరం ఉండడం వల్ల దాన్ని అలాగే కొనసాగించారు.













