NRI Donation: బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి రూ.కోటి విరాళం
అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో-అమెరికాన్ క్యాన్సర్ ఆసుపత్రికి పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తలూరుకు చెందిన ఎన్నారై డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ (Dr vamsikrishna), ప్రతిభ (Pratibha) దంపతులు రూ.కోటి విరాళం ఇచ్చారు. విరాళం చెక్కును రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కు అందజేశారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ దంపతులను సీఎం అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని వివిధ దేశాల్లోని ప్రవాసాంధ్రులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణకు సీఎం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ కుటుంబ సభ్యులు నూతలపాటి సురేంద్ర బాబు తదితరులు, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.













