టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంతో.. అమెరికాలో ఉద్యోగాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి, డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ పొందిన వారికి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలు పొందేలా టీడీపీ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ సెంటర్ శిక్షణ ఇస్తోంది. దీని ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకొని భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగావకాశాలను యువత అందిపుచ్చుకోవాలి అని ఆకాంక్షించారు. ఈ శిక్షణలో సహకారం అందించిన వేమూరి రవికుమార్‌తో పాటు ఉద్యోగాలు పొందిన వారిని చంద్రబాబు అభినందించారు.













