తిరుమలలో శ్రీవారి దర్శనాలు నిలిపివేత
కలియుగ పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోనికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. శ్రీవారి సేవలు యధాతథంగా జరుగుతాయనీ, అర్చకులు వాటిని నిర్వహిస్తారనీ పేర్కొంది. అలిపిరి గేటును మూసివేశారు. తిరుమలలో ఒక భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
తిరుమలలో కరోనా అనుమానిత కేసు
తిరుమలలో ఒక భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. అతడిని వెంటనే అశ్వనీ ఆసుపత్రికి, అక్కడి నుంచి రుయా ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పర్యవసానంగా తిరుమలకు వెళ్లే వాహనాలన్నిటినీ నిలిపివేశారు. అలిపిరి గేటును మూసివేశారు.













