Puri Jagannadh: పూరీ సినిమాలో నిహారిక?
లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాలతో పూర్తిగా తన ఫామ్ ను కోల్పోయిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కు ఎవరు ఛాన్స్ ఇస్తారా అనుకుంటున్న టైమ్ లో ఓ బడా హీరోను ఒప్పించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ జగన్నాథ్ కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమాను చేయనున్నాడు.
ఉగాది సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చిన పూరీ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. 60 రోజుల్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఎంతో పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడని సమాచారం. ఈ సినిమాలో టబు(Tabu) ఓ కీలక పాత్రలో నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక NM(Niharika NM) ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది అంటున్నారు. రీసెంట్ గా పెరుసు(Perusu) సినిమాలో నటించి మెప్పించిన నిహారిక ఇప్పుడు పూరీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. మరి పూరీ సినిమాలో నిహారిక ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనేది చూడాలి.













