19 నుంచి గన్నవరం-ముంబయి నూతన విమాన సర్వీసు
డిసెంబర్ 19 నుండి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏవియేషన్ రంగంలో మనదేశం 14వ స్థానంలో ఉందన్నారు. నీటిలో, గాలిలో పయనించే సీప్లేన్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన కోరిక మేరకు విజయవాడలో సీప్లేన్ ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు.













