Vijaykumar : ఆయన్ను విమర్శించే అర్హత భూమనకు లేదు : విజయ్ కుమార్

భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అక్రమంగా రూ.కోట్లు సంపాదించారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ (Vijaykumar) విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన భూమన ఎక్కడికీ తప్పించుకోలేరన్నారు. ఆయన్ను చట్టం ముందు దోషిగా నిలబెడతామని చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయం. టీటీడీ చైర్మన్ (TTD Chairman) గా ఉన్న సమయంలో టీటీడీ లో రూ.1233 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు (Commissions) నొక్కేశారు. ఆయన అవినీతిని త్వరలోనే బయటపెడతాం. రూ.కోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి. బీఆర్ నాయడు (BR Naidu) కష్టంతో పైకొచ్చిన వ్యక్తి. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన్ను విమర్శించే అర్హత భూమనకు లేదు అని అన్నారు.