ప్రతి ఒక్కడూ జీవితాంతం గుర్తుండే శిక్ష : లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపో మాపో జైలుకి పోయే గాలి గాడిని చూసుకొని రోడ్లపై ఆంబోతుల్లా తిరుగుతున్న ప్రతి ఒక్కడూ జీవితాంతం గుర్తుండే శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలం, కొప్పర్రులో టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నేతలు చేసే తప్పుడు పనులకు ఆహో ఓహో అంటూ కితాబివ్వడం మాని పోలీసులు శారద కుటుం సభ్యులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













