Nara Lokesh:స్మార్ కిచెన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

కడప జిల్లా సీకెదిన్నె ఎంపీపీ హైస్కూలు (MPP High School ) లో అధునాతన స్మార్ట్ కిచెన్ (Smart Kitchen) ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. ఈ కిచెన్ లో 1787 మంది విద్యార్థులకు భోజనం తయారు చేసి, పంపిణీ చేశారు. కమలాపురం (Kamalapuram) నియోజకవర్గంలో 2, జమ్మలమడుగు (Jammalamadugu) నియోజకవర్గంలో 2, కడప నియోజకవర్గంలో మరో స్మార్ట్ కిచెన్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి రుచికరమైన భోజనం తయారు కానుంది. ప్రత్యేక వాహనాల ద్వారా వండిన భోజనాన్ని పాఠశాలలకు తరలించనున్నారు. డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్‌డ్ స్మార్ట్ కిచెన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెల్లడిరచారు. వాటి ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు ఆహారం అందిస్తామని తెలిపారు.