2019 నాటికి 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం
రాష్ట్రంలో ఐటీ, తయారీ రంగాల ద్వారా 2019 నాటికి 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పెద్దాపురంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో 250 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన అపర్ణ వెటిరో సిరామిక్స్ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న పేదల గృహ సముదాయాలను మంత్రి పరిశీలించారు. లోకేష్ పర్యటలో హోంమంత్రి చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.













