Nara Lokesh : అలా చేయకుంటే వారిపై చట్టప్రకారం : మంత్రి లోకేశ్ హెచ్చరిక
తల్లికి వందనంలో రూ.13 వేలు ఇచ్చి రూ.2 వేలు నా ఖాతాల్లో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ రూ.2 వేలు నా ఖాతాలో పడినట్టు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే వారిపై చట్టప్రకారం ముందుకెళ్తానని తేల్చి చెప్పారు. అసత్య ఆరోపణలని గతంలో మాదిరి ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిరాధారణ ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 80 శాతం మంది పాఠశాల విద్యార్థుల (Students)కు కిట్లు అందించామని తెలిపారు. మిగిలిన 20 శాతం మందికి ఈ నెల 20వ తేదీ లోపు అందిస్తాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం. కొందరి ఖాతాలు యాక్టివ్ లేక నిధులు తిరిగి వచ్చాయి. ఖాతాలు యాక్టివ్ అయ్యాక తల్లికి వందనం నగదు వేస్తాం. 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ (One Class One Teacher Model) తీసుకొచ్చాం. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఏడాదిలో చూపిస్తాం. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ ఉచిత కరెంట్ (Free current )ఇస్తున్నాం. సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తాం. మెగా డీఎస్సీ (Mega DSC) నియామక ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ బడుల్లో నాణ్యత పెంచాలనేది మా లక్ష్యం. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం వర్తించదు. వైసీపీ హయాంలో విద్యాశాఖను నాశానం చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి (Minister of Education) ఏం చేశారో మాకు తెలియదు. ప్రభుత్వ బడుల్లో ఎంమంది చదువుతున్నారో తెలుసుకునేందుకు వందరోజులు పట్టింది అని అన్నారు.













