రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
ఇంధన పొదుపులో హెరిటేజ్ సంస్థకు రెండోసారి అవార్డు వచ్చింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నారా బ్రహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ సంస్థకు అవార్డు లభించింది. దేశంలో ఇంధన ఆదాలో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అయితే ఇందులో హెరిటేజ్ సంస్థ కూడా ఉండడం గమనార్హం. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ ఇంధన ఆదా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తదితరులు విచ్చేశారు. కాగా అవార్డులకు ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి, కేంద్ర మంత్రి అవార్డులను ప్రధానం చేశారు. హెరిటేజ్ సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హెరిటేజ్ సంస్థ పదేళ్లలో 8 అవార్డులు వచ్చాయని తెలిపారు. ఎలక్ట్రికల్ సేవింగ్ 14.5 శాతం తగ్గించగలిగామని అన్నారు.













