ప్రజలంతా తమ హక్కుల కోసం పోరాడాలి : భువనేశ్వరి
రాష్ట్రంలోని ప్రజలంతా తమ హక్కుల కోసం పోరాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల సమీపంలో గోకుల్ హెరిటేజ్ రెండో పార్లర్‌ను ఆమె ప్రారంభించారు. పార్లర్లోని వస్తువులను కొనుగోలు చేసి ఉద్యోగులు, అక్కడికి వచ్చిన గ్రామస్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ హైవేలో వెళ్లే ప్రయాణికులకు స్వచ్చమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడమే తమ ఉద్దేశమని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజల కోసం పోరాడుతున్నాడని అన్నారు. యువగళం పాదయాత్ర రేపు 200వ రోజుకు చేరుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో కొంతమంది వెళ్లి పాదయాత్రలో పాల్గొంటారని తెలిపారు. లోకేశ్‌కు దేవుడు అన్ని శక్తులూ ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.













