పెన్షన్లు ఇవ్వడం చేతకాక చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు.. నారా భువనేశ్వరి
నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర లో భాగంగా నంద్యాల లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశం లో మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ చేయడం చేతకాక అనవసరంగా చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు అని అన్నారు. టిడిపి అధికారంలో వస్తే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ప్రజలకు నిజమైన ప్రగతి చూపిస్తారు అని అన్నారు. పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం చేతకాని వైసీపీ ప్రభుత్వం ఆ నెపాన్ని చంద్రబాబు మీదకు నెట్టాలని ప్రయత్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. టీడీపీ పై విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక కుటుంబాన్ని సక్రమంగా నడపాలి అంటే తండ్రి ఎంత ముఖ్యమో… రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించడానికి మంచి నాయకుడు కూడా అంతే ముఖ్యమని భువనేశ్వరి అన్నారు.













