ఈ ప్రభుత్వానికి ఆ హక్కు ఎక్కడిది?: భువనేశ్వరి
తనను కలిసి సంఫీుభావం తెలిపేవారిపై ప్రభుత్వంపై కేసులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆ హక్కు ఎక్కడిదని నిలదీశారు. రాజహేంద్రవరం వస్తున్న తమకు సంఫీుభావం తెలియజేస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజలు మద్దతుదార్లపై నిబంధనలు ఉల్లంఘించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో పెట్టారు. రాజమహేంద్రవరంలో ఉంటున్న నన్ను కలిసి ధైర్యం చెప్పడానికి వస్తున్న టీడీపీ శ్రేణులపై, సంఫీుభావయాత్ర చేస్తున్న వారిపై కేసులు పెడతారా? ఈ ప్రభుత్వానికి ఆ హక్కు ఎక్కడిది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల లాంటి వారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని, నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కుడ ఎక్కడిది అని ప్రశ్నించారు.













