ఈ నెల 23 నుంచి గుంటూరులో .. నంది నాటకోత్సవాలు
నంది నాటకోత్సవాలను ఈ నెల 23 నుంచి 29 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేవ్ చలనచిత్ర, టివి, నాటరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాటంక రంగ విస్తరణకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాటక రంగ విస్తరణకు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. ఎపీ ఫిల్మ్ టివి, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటకోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. నంది నాటకోత్సవాల్లో భాగంగా 115 ప్రదర్శనలకు గానూ రాష్ట్రం నలుమూలల నుంచి పద్య, సాంఘిక, బాలల నాటికలు, కళాశాల లేదా యూనివర్సిటీ నాటిక (ప్లేలెట్స్) విభాగాల్లో ఎంపిక చేసిన 38 నాటక సమాజాలు ఈ పోటీ పాల్గొంటున్నాయన్నారు. ఆయా విభాగాల్లో కలిపి మొత్తం 74 అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పోసాని తెలిపారు.













