Nagarjuna: ఎలాంటి పాత్రలైనా చేసేస్తా
ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna) కలయికలో శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన సినిమా కుబేర(kubera). తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ వస్తోంది. సినిమా చూసిన వారు శేఖర్ కమ్ముల రైటింగ్, డైరెక్షన్ తో పాటూ ధనుష్, నాగార్జునల నటన గురించి కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని నాగ్ మొదటి నుంచే చెప్పుకుంటూ వచ్చాడు.
కానీ రిలీజ్ కు ముందు నాగ్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు సినిమా రిలీజయ్యాక నాగ్ చెప్పిన మాటలన్నీ నిజమే అని అర్థమవుతుంది. దీపక్(deepak) అనే సీబీఐ ఆఫీసర్ రోల్ లో నాగ్(Nag) చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. టాలీవుడ్ లోని అగ్ర హీరోల్లో ఒకడైన నాగ్, ఇలాంటి క్యారెక్టర్ చేయడం మామూలు విషయం కాదని కుబేర చూసిన అందరూ మాట్లాడుకుంటున్నారు.
రొమాంటిక్ సినిమాలు చేస్తూ మన్మథుడు ఇమేజ్ ను తెచ్చుకున్న నాగ్, ఇప్పుడు కుబేరలో డీ గ్లామర్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. దీపక్ పాత్రలో నాగ్ యాక్టింగ్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా కొత్తగా కనిపించాయి. దీపక్ లాంటి డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను నాగ్ ఎంతో అవలీలగా చేసి కుబేర సక్సెస్ లో తనదైన పాత్ర పోషించడంతో పాటూ యాక్టర్ అంటే ఎలాంటి పాత్రలైనా చేసే వాడని నిరూపించాడు నాగ్.













