వారి పాపాలను పవన్ కడుగుతున్నాడు.. వైరల్ అవుతున్న మెగా బ్రదర్ ట్వీట్..
తిరుమల లడ్డు (Tirumala Laddu) కల్తీ విషయంలో రోజుకొక సరికొత్త వార్త తెరమీదకి వస్తోంది. అయితే ఈ విషయంలో అందరూ ఒక ఎత్తు.. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక ఎత్తు అన్నట్లు పరిస్థితులు ఉన్నాయి. తిరుమలలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని (Sri Venkateswara Swamy)క్షమాపణ కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని (Kanakadurga Temple) సందర్శించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ మెట్లను శుభ్రం చేసి, మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టారు.. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్.. తిరుమల లడ్డు ( Tirumala Laddu) గురించి మాట్లాడిన కొందరు సినీ ఇండస్ట్రీ వ్యక్తులపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే తనను విమర్శించే వైసీపీ వ్యక్తులకు ఎంత గొడవ పెట్టుకున్న ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఓ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సనాతన ధర్మం జోలికి రాకూడదని.. ధర్మాన్ని కాపాడడం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని జనసేనాని పేర్కొన్నారు.
అయితే సాధారణంగా ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఎంట్రీ ఇవ్వకుండా ఉండడం జరగని పని. అందుకే మళ్ళీ మరొకసారి నాగబాబు తన కవిత్వానికి పని చెబుతూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షపై తన రేంజ్ లో ఓట్ వీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy), వైసీపీ ( YCP)ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం చేసి కడుగుతున్నారు అని నాగబాబు ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇక దీనిపై స్పందించిన కొందరు నెటిజెన్లు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాని విషయాన్ని నాగబాబు పేర్కొనడం ఆయన పరిపక్వతకు నిదర్శనం అని విమర్శిస్తున్నారు. మరి దీనికి నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.













