రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే
ఈ నెల 28న జనసేన-టీడీపీ సభ నిర్వహిస్తోందని, ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు? హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలి. జనసేన, టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం అవసరం అని అన్నారు.













