నా బాట వైసీపీ వైపే.. ముద్రగడ్డ పద్మనాభం క్లారిటీ..
ముద్రగడ్డ పద్మనాభం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు సంఘం నాయకుడు. సంయుక్త ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి గా వ్యవహరించిన ముద్రగడ గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో పనిచేశారు. గత కొన్ని రోజులుగా ఈయన జనసేనలో చేరతాడని ..కాదు వైసిపి గూటికి వెళ్తాడని..కానే కాదు టీడీపీ తీర్థం పుచ్చుకుంటాడు ..అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్ పై ముద్రగడ్డ స్పష్టతని ఇచ్చారు. మంచి రోజు చూసుకొని వైసీపీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే అధికారికంగా తాను వైసీపీలో చేరబోయే డేట్ ని కూడా అనౌన్స్ చేస్తానని ముద్రగడ్డ స్పష్టం చేశారు. మొదట ముద్రగడ తో టీడీపీ,జనసేన పార్టీలు సంప్రదింపులు కూడా జరిపాయి. అయితే తాను ఆశించిన సానుకూల హామీలు ఆ పార్టీల నుంచి రాకపోవడంతో ముద్రగడ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇటు ఎంపీ మిధున్ రెడ్డి ద్వారా సంప్రదింపులు జరిపిన వైసీపీ.. అతనికి కావలసిన హామీలు ఇవ్వడంలో ఫలించినట్లు ఉంది. అందుకే వైసీపీలో చేరడానికి ముద్రగడ్డ ఫిక్స్ అయ్యారు.













