అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తే … జగన్ పై పోటీ చేస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా పారదర్శకంగా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పోటీ చేస్తానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని తెలిపారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అన్నారు. పార్టీలో 125 మందితో సంతకాలతో ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేసి పోటీలో నిలబడతానని వెల్లడించారు.













