అదో మతిలేని ప్రకటన : రఘురామ కృష్ణరాజు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి పర్యటనలకు వెళ్లినప్పుడల్లా రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ అగ్గిరాజేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అదో మతిలేని ప్రకటన అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల విషయంపై ఆయన మండిపడ్డారు. రాజధానిని తరలించాలని చూస్తే భూముల్చిన వేల మంది రైతులు చూస్తూ ఊరుకోరన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యిందన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే అధికారులే వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేశారు.













